మంచి స్నేహితుడా – మంచి కాపరివి //2//

అగాధ జలములలో – నేను నడచినను 

అరణ్య యానములో  – నేను తిరిగినను 

నను ఆదరించినావు, ఒదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు //2//

నీకే ఆరాధన …నీకే ఆరాధన …నీకే ఆరాధన …నీకే ఆరాధన …

ఆరాధన …ఆరాధన … ఆరాధన …నీకే ఆరాధన … //2//

 

చ1: తప్పిపోయిన నన్ను – వెదకి రక్షించినావు 

ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి – నన్ను పిలచుకున్నావు //2//

ఘనమైన పరిచర్యను- నాకు దయచేసినావు 

ప్రధాన కాపరిగా – నన్ను నడిపించినావు //ఆరా//

చ2: చేరలోనున్న నన్ను – విడుదల చేసినావు 

బంధింపబడియున్న నన్ను – విడిపింప చేసినావు //2//

నాలోనున్న నిన్ను – లోకానికి చూపినావు 

నీలోనున్న నన్ను – నీ సాక్షిగా నిలిపినావు //ఆరా//

చ3: ఒంటరిఐన నన్ను – వేయిమందిగ చేసితివి 

ఎన్నికలేని నన్ను – బలమైన జనముగ చేసితివి//2// 

నను హెచ్చించినావు – నాకొమ్ము పైకెత్తినావు //2// ఆరా//