Memu velli Chuchinaamu Song Lyrics

మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ //మేము//

  1. బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ = బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో //మేము//

  2. జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము //మేము//

  3. తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా //మేము//

  4. మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగము = త్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము //మేము//

  5. పరిశుద్ధాత్మ జన్మ మాకు – వరముగా నొసంగెను = పరమపురము మాకు హక్కు – పంచెదాను నిరతము //మేము//

  6. మాకు సర్వగర్వమణిగి – మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను //మేము//

Lyrics in English:

Memu velli chuchinaamu swami Yesu Kreesthunu = Prema mrokka vachhinaamu – Maa manambu lalaraga //Memu//

1.Betalemupuramulona – beedakanya Mariyaku = Bedagaa suropudaalchi – velase basulapaaalo //Memu//

2. Jnaanulamani garvapadaka – deenulamai nityamu = vaani prema sakala prajaku – maanaka prakatintumu //Memu//

3. Taddarisanamandu maaku = beddamelu kaligeraa = Hadduleni paapamanta – radduparachabadenuga //memu//

4.Maranamepudo repomaapo – mariyepudo manamerugamu = twaraga poyi paramaguruni – darishanambu jetamu //memu//

5. Parishuddhatma Janma maaku – varamuga nosangenu = Pramapuramu maaku hakku – panchedaanu niratamu //memu//

6. Maaku sarvagarvamanigi – manchi maargamabbenu = Maaku nee suvaartha jeppa makkuvento galigenu //memu//

Credentials:
Song: Memu velli Chuchinaamu
Lyrics and Tune: Unanimous
Andhra Kraistava Keerthanalu Song no: 118
రా – జంఝూటి
తా – ఆది