నాదాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా 

నా కేడెము కోట నీవే /2/- నా రక్షణ దుర్గమా /నా/

1. నీవే ప్రభుడవు – నీవే నా కాపరి /2/

కనుపాపవలె నను కాపాడుము – నీ నీడలో నను దాయుము /3/నా/

2. నీవే దయాళుడవు దాక్షిణ్యమూర్తివి   

దీర్ఘశాంతుడా కృపామయా – నిత్యము నిన్ను స్తుతించెదను /3/నా/

3. ఆశ్చర్య కరుడవు – అద్భుతకారుడా /2/

అద్వితీయుడా – నా ఆశ్రయమా ఆధారం నీవె ప్రభూ /3/నా/