||పల్లవి||నా పేరే తెలియని ప్రజలు -ఎందరో ఉన్నారు 

నా ప్రేమను వారికి ప్రకటింపన్-కొందరే ఉన్నారు 

||అను పల్లవి ||ఎవరైనా …మీలో ఎవరైనా ( 2 )  

వెళతారా ..నా ప్రేమను చెబుతారా || నా పేరే ||  

1.నేను నమ్మిన వారిలో -కొందరు మోసం చేసారు 

వెళతామని చెప్పి -వెనుకకు తిరిగారు||అను పల్లవి||    

2. వెళ్లగలిగితే మీరు -తప్పక వెళ్ళండి 

వెళ్ల లేకపోతే-వెళ్ళే వారిని పంపండి||అను పల్లవి||

3.రక్షణ పొందని ప్రజలు -లక్షల కొలదిగా ఉన్నారు

మారు మూల గ్రామాల్లో-ఊరి లోపలి వీధుల్లో ||అను పల్లవి||