||పల్లవి|| నా ప్రియ యేసు రాజా-ఆదుకో నన్నెపుడు శోధనలో వేదనలో -నిను వీడి పోనియకు 1. కలుషితమగు ఈ లోకం -కదిలెను నా కన్నులలో మరణ శరీరపు మరులే -మెదిలెను నా హృదయములో ||అను పల్లవి|| కల్వరిలో ఆదరించు – ఆదరించు- ఆదరించు|| నా ప్రియ || 2. మరచితి నీ వాగ్దానం -సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు సుడులే -వడిగా నను పెనుగొనగా||అను పల్లవి|| 3. నేరములెన్నో నాపై -మోపెను ఆ అపవాది తీరని పోరాటములో -దూరముగా పరుగిడితి||అను పల్లవి|| 4. చాలిన నిన్ను విడచి – కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి -వదలితి వాక్యాధారం||అను పల్లవి|| 5. నీ కృపలను నే మరచి -క్రుతజ్ఞుత వీడితి ప్రభువా హృదయము కఠినమైపోయే -కరిగించి దీవించు ప్రభువా||అను పల్లవి||