||పల్లవి|| నా ప్రియ యేసు రాజా-ఆదుకో నన్నెపుడు 

శోధనలో వేదనలో -నిను వీడి పోనియకు 

1. కలుషితమగు ఈ లోకం -కదిలెను నా కన్నులలో 

 మరణ శరీరపు మరులే -మెదిలెను నా హృదయములో  

||అను పల్లవి|| కల్వరిలో ఆదరించు – ఆదరించు- ఆదరించు|| నా ప్రియ || 

2. మరచితి నీ వాగ్దానం -సడలెను  నా విశ్వాసం 

 శ్రమల ప్రవాహపు సుడులే -వడిగా నను పెనుగొనగా||అను పల్లవి|| 

3. నేరములెన్నో నాపై -మోపెను ఆ అపవాది

తీరని పోరాటములో -దూరముగా పరుగిడితి||అను పల్లవి||  

4. చాలిన నిన్ను విడచి – కోరితి దీవెనలెన్నో 

భావనలేమో అరసి -వదలితి వాక్యాధారం||అను పల్లవి||

5. నీ కృపలను నే మరచి -క్రుతజ్ఞుత వీడితి ప్రభువా

హృదయము కఠినమైపోయే -కరిగించి దీవించు ప్రభువా||అను పల్లవి||