నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును – దేవ నీకేమి చెల్లింతును /2/

హల్లెలూయా యేసునాధా – కృతజ్ఞతా స్తుతులివే /2/నాకెన్నో/

1. కృపచేత నన్ను రక్షించినావే – కృప వెంబడి కృపతో నను బలపరచితివే 

నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి – పరిశుద్ధపరచితివే 

2. నాకిక ఆశలు లెవనుకొనగా – నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే 

నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా కభయమిచ్చితివే      

3. నా కాడి మోసి నా తోడు నీవే – నీ చేతి నీడలో నను దాచియున్నావే 

ఏ కీడు నాకు రాకుండ చేసి – నీ జాడలో నన్ను నడిపించుచున్నావే 

4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు – రానున్న రారాజువు నా రాజువు నీవు 

నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు – ననుకొన్న వాడావు,నా రాజువు నీవు