||పల్లవి||నజరేయుడా నా యేసయ్య -ఎన్ని యుగాలకైనా..

ఆరాధ్య దైవము నీవేనని-గళమెత్తి నీ కీర్తి నే చాటెద||నజరేయుడా||

1.  ఆకాశ గగనాలను – నీ జేన తో కొలిచితివే(2)

శూన్యములో ఈ భూమిని -వ్రేలాడ దీసిన నా యేసయ్య(2)

|| అను పల్లవి || నీకే వందనం -నీకే వందనం (2)

2. అగాధ సముద్రాలకు -నీవే ఎల్లలు -వేసితివే

జలములలో బడి నీ వెళ్ళినా -నన్నేమి చేయవు నా యేసయ్య || అను పల్లవి ||

3. సీయోను  శిఖరాగ్రము నీ సింహాసన మాయేనా

సీయోనులో నిను చూడాలని -ఆశతో ఉన్నాను నా యేసయ్య || అను పల్లవి ||