పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు – నా పాపము – నా శాపము తొలగించెను – నన్ను కరుణించెను (2X)/నన్నెంత/ 1. సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2X) పడనీయక – నన్ను చెడనీయక (2X) తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను(2X)/నన్నెంత/ 2. సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2X) నేర్పించెను – నాకు చూపించెను (2X) వర్ణించగాలేను ఆ ప్రభువును (2X/నన్నెంత/ 3. కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2X) నా కోసమే – తాను శ్రమ పొందెను (2X) నా పాపమంతటిని క్షమియిం చెను (2X/నన్నెంత/ 4. ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2X) ఏమిచ్చెదన్ – నేనేమిచ్చెదన్ (2X) నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X/నన్నెంత/