పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను

 నా యేసుడు – నా పాపము – నా శాపము

తొలగించెను – నన్ను కరుణించెను (2X)/నన్నెంత/

1.  సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2X)

 పడనీయక – నన్ను చెడనీయక  (2X)

తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను(2X)/నన్నెంత/

2. సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2X)

 నేర్పించెను – నాకు చూపించెను (2X)

వర్ణించగాలేను ఆ ప్రభువును  (2X/నన్నెంత/

3.  కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2X)

నా కోసమే –  తాను శ్రమ పొందెను (2X)

నా పాపమంతటిని క్షమియిం చెను (2X/నన్నెంత/

4.  ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2X)

ఏమిచ్చెదన్ –  నేనేమిచ్చెదన్ (2X)

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X/నన్నెంత/