Em                          C      D        Em       

నే సాగెద ఏసునితొ – నా జీవిత కాలమంతా (2)

  Em                     G                                   D

1. ఏసుతో నడిచెద – ఏసుతో గడిపెద – పరమును చేరగ

C      Em              C   D                 Em         

నే వెల్లెద,  హానొకు వలె సాగెదా….. ఆ..ఆ.. #నే సాగెద#

    

2. తల్లియె మరచిన తండ్రియె విడచిన – బంధువులే నను వెలి వేసినా- బలవంతునితో సాగెదా….#నే సాగెద#

3. వెనుక శత్రవులే వెంటాడినను – ముందు సముద్రము ఎదురొచ్చినా- మోషే వలె సాగెదా….#నే సాగెద#

4. మరణ శాసనం హెచ్చించినను – సింహపు బోనులో నను వేసినా – దానియెలు వలె సాగెదా….#నే సాగెద#

5. లోకపు శ్రమలు నన్నెదిరించిన – కఠినులు రాళ్లతో హింసించినా – స్తెఫను వలె సాగెదా….#నే సాగెద#

6. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే – క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా….#నే సాగెద#