పల్లవి: యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా మమ్ము రక్షించి నిత్య రాజ్యములో నడుపము మా ప్రభువా – నడుపుము మా ప్రభువా /యేసు/ 1. కృంగిన వేళలలో – అలసిన సమయములో నా చేయి విడువకను – నన్ను నిలబెట్టు నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి నిలుపుము జ్యోతివలె – నిలుపుము జ్యోతివలె /యేసు/ 2. సిలువను మోసికొని – సువార్త చాటింప విలువగు నీ శక్తిచే – నిత్యము నడిపించు యేసు నీ రాకడలో – నిన్ను ఎదుర్కొనుటకు నీ కృప నీయుమయా – నీ కృప నీయుమయా /యేసు/