నీ ప్రేమ ఎంతో అపారము – వర్ణించ తరమా నా ప్రభు పులకింప చేసెను నా హృది – హృదయేశ్వరా నా యేసువా (2) 1. నన్ను ఎంతో ప్రేమించి – నాదు పాపము క్షమియించి కృప కనికరముల నీడలో – నన్ను చేర్చిన నా ప్రభూ జీవితమంతా స్తుతించినా – తీరునా రుణం….. తీరునా రుణం….. 2. నీదు సన్నిధి కాంక్షించి – పాప బ్రతుకే వీడితిని నీదు జీవమే నిండుగా – నాలో నింపుము నా ప్రభు జీవితమంతా నీ ప్రేమన్ – చాటు చుందును… చాటు చుందును… 3. సముద్రము కంటే లోతైనది – గగనము కంటే ఎత్తైనది మరణము కంటే బలీయము – శాశ్వతమైనది నీ ప్రేమ నీదు ప్రేమ నా ప్రభూ – మరువగ సాధ్యమా…. మరువగ సాధ్యమా….