నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసు డాలాకించున్ 2 నీ వాక్యమును నేర్పించు – దాని యందు నడచునట్లు నీతో 2 1. ఉదయమున లేచి – నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచి రక్షించు ఆపదలను౦డి 2 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసు కొ౦దు నీ మార్గములో నడచు నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు(2) 3. భయభీతులలో తుఫానూలలో – నీ స్వరము వినిపించుము అభయమునిమ్ము ఓగొప్ప దేవా – ధైర్యపరచుము నన్ను(2) 4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా – నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిచేసుకొ౦దు – నీ దివ్య వాక్యము ద్వారా(2) 5. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది – అది రెండంచుల ఖడ్గము నీ వాక్యమేగా అద్భుత అద్దం – నిజ స్వరూపమును చూపించున్(2) 6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా – నీ వాక్యమును ఎంతో నన్ను౦చుము ప్రభువా – నీ విశ్వాశ్యతలో నీ యందు నిలచునట్లు(2) 7. నా హృదయములోని చెడుతల౦పులను – చేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను – నీదు మహిమ కొరకేగా2