నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసు డాలాకించున్ 2

నీ వాక్యమును నేర్పించు – దాని యందు నడచునట్లు నీతో 2

1. ఉదయమున లేచి – నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము

దినమంతటి కొరకు నను సిద్ధపరచి రక్షించు ఆపదలను౦డి 2

2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసు కొ౦దు

నీ మార్గములో నడచు నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు(2)

3. భయభీతులలో తుఫానూలలో – నీ స్వరము వినిపించుము

అభయమునిమ్ము ఓగొప్ప దేవా – ధైర్యపరచుము నన్ను(2)

4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా – నీ స్వరము నా కొరకే

నీతో మనుష్యులతో సరిచేసుకొ౦దు – నీ దివ్య వాక్యము ద్వారా(2)

5. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది – అది రెండంచుల ఖడ్గము

నీ వాక్యమేగా అద్భుత అద్దం – నిజ స్వరూపమును చూపించున్(2)

6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా – నీ వాక్యమును ఎంతో

నన్ను౦చుము ప్రభువా – నీ విశ్వాశ్యతలో నీ యందు నిలచునట్లు(2)

7. నా హృదయములోని చెడుతల౦పులను – చేదించు నీ వాక్యము

నీ రూపమునకు మార్చుము నన్ను – నీదు మహిమ కొరకేగా2