పల్లవి: నీలాకాశంలోన నింగికెగసె తార (2x) ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం (2x) ఆనందం ఆనందం అరుణోదయానందం నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం 1. ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్ (2x) సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు||నీలా|| మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ 2. గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x) నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా ||నీలా||