Neeti suryudaina Yesu raakatone song lyrics
నీతిసూర్యుడైన యేసు రాకతోనే – పాపభీతినొందు మానవాళి దిగులు పోయెనే /2/
జ్యోతిర్మయుడైన దేవుడు తానె /2/
భానుడుగా భువిపైన కాలుమోపగానే
చీకటి శక్తులకు వణుకుపుట్టెనే /నీతి/
1. ప్రభుసన్నిధిలో ఆనందముండును – కీడుచేయు శత్రువులను దూరపరచును
బంధకములను తెంపివేయను – మన బంధకములు తెంపివేయను
ఇమ్మానుయేలుగా అవతరించెను – యెహోవా షమ్మా మన మధ్యనుండెను /నీతి/
2. ప్రభు సన్నిధిలో ఆరోగ్యముండును – పాడుచేయు రోగములను స్వస్థపరచును
దుఃఖమును మాన్పివేయను – మన దుఃఖమును మాన్పివేయను
ఆశ్చర్యకరుడుగా అవతరించెను – నీతిసూర్యుడుగా మన మధ్యనుండెను /నీతి/
3. ప్రభుసన్నిధిలో సమాధానముండును – వేరుచేయు పాపములను శుభ్రపరచును /2/
చింతలను తీర్చివేయను – మన చింతలను తీర్చివేయను
ఆపద్బాంధవుడిగా అవతరించెను – యెహోవా షాలోమ్ మన మధ్యనుండెను /నీతి/
Lyrics in English:
Neeti suryudaina Yesu raakatone – paapabheetinondu maanavaali digulu poyene! /2/
jyotirmayudaina devudu taane /2/
Bhaanudugaa bhuvipaina kaalu mopagaane
Cheekati shaktulaku vanuku puttenu /neeti/
1. Prabhu sannidhilo aanandamundunu – Keedu cheyu satruvulanu dooraparachunu
Bandhakamulanu tempiveyunu – Mana bandhakamulu tempiveyunu
Emmaanuyelugaa avatarinchenu – Yehovaa shamma mana madhyanundenu /neeti/
2. Prabhu sannidhilo aarogyamundunu – paaducheyu rogamulanu swasthaparachunu
Dukhamunu maanpiveyunu – Mana dukhamunu maanpiveyunu
Aaschryakaruduga avatarinchenu – Neeti suryuduga mana madhyanundenu /neeti/
3. Prabhu sannidhilo samaadhaanamundunu – verucheyu paapamulanu subharaprachunu /2/
Chintalanu teerchiveyunu – mana chitalanu teerchiveyunu
Aapadbhaandavuduga avatarinchenu – Yehova shaalom mana madhyanundenu /neeti/
Credentials:
Music, Lyrics, sung by: A.R.Stevenson
Album: Niraashaprachadu
Song: Neetisuryudaina
Watch this song on below YouTube link: