పల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి – వేరుతన్ని ఎదిగి ఫలియింతుము చింత పడము మాకాపుమానము – యేసు కృప చాలును /నీటి/ 1. పాపం పోయెను హల్లెలూయ – యేసు లేచెను హల్లెలూయ యేసు వచ్చెను హల్లెలూయ – స్తుతి గీతం పాడుదము /నీటి/ 2. యేసే మార్గము హల్లెలూయ – యేసే సత్యము హల్లెలూయ యేసే జీవము హల్లెలూయ – యేసు వార్తను చాటుదము/నీటి/ 3. వాక్య ధ్యానము హల్లెలూయ – ప్రార్థనాత్మతో హల్లెలూయ ఏకత్వముతో హల్లెలూయ – సహవాసం కోరుదమా /నీటి/