నీతిగల యెహోవా స్తుతి మీ – యాత్మతో నర్పించుడి – మీ యాత్మతో నర్పించుడి 

దాతయౌ మన క్రీస్తు నీటిని – దాల్చుకొని సేవించుడి /నీతి/ 

1. చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా = 

సదమలంబగు దైవనామము – సర్వదా నుతిజేయును /నీతి/

2. సర్వశక్తుని కార్యముల కీ – సర్వరాష్ట్రము లన్నియు  = 

గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయును /నీతి/

3. గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో = 

పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి /నీతి/

4. పరమదూతలు నరులు పుడమిని – మొరలు బెట్టుచు దేవుని = 

పరమునందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు /నీతి/