నీవే నా ప్రాణము – నీవే నా సర్వము నీవే నా జీవము – యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ – విడువలేనయా నీ స్నేహం(2) ||నీవే|| 1. మార్గం నీవే – సత్యం జీవం నీవే జీవించుటకు – ఆధారం నీవే (2) అపాయం రాకుండ కాపాడువాడవు – నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| 2. తోడు నీవే – నా నీడ నీవే నిత్యం నా తోడుండే – నా చెలిమి నీవే (2) బ్రతుకంతా నీ కొరకే జీవింతును – నిను నేను అరాధింతున్ (2) ||నీవే||