NEEVE NEEVE

Lyrics in TeluguLyrics in English

నీవే నీవే నీవే మా ప్రాణం​! ​- యేసు నీవే నీవే మా గానం​!

ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య

కొలుతుము నిన్నే యేసయ్య

1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూ​పి కాచే ప్రేమ​!

ఆదియు నీవే​… ఆదియు నీవే​ అంతము నీవే – నీ చరణములే శరణమయ

నిను పోలి ఇలలోన – ఒకరైన కనరారే

నివు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా

విలువైన వరమేగా – నివు చూపే అనురాగం

కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే​…!

నీ ప్రియ స్నేహం – ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం ​//నీవే//

2. ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం

నీ కృపలోనే​… నీ కృపలోనే​ చూచిన దేవా – జీవనదాత యేసయ్య

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు

కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు

ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు

ఎనలేని దయ చూపే – బలమైన నామమే

నీ ఘన నామం – మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం​ ​//నీవే//

​Neeve neeve neeve maa praanam! – Yesu neeve neeve neeve maa gaanam!

​Aasrayamaina aadhaaramaina nee divya prema chaalayya

​Kolutumu ninne Yesayya

​1. Saswatamaina nee toliprema – Maargamu choopi kaache prema!

​Aadiyu neeve.. aadiyu neeve, antamu neeve – nee charanamule sharanamayaa

​nine poli ilalona – okaraina kaanaraare

​Neevu leni bratukanta – Yugamaina kshayamega

​Viluvaina varamega – neevu choope anuraagam

​Kalakaalam viraboose – priyamaara snehame..!

​Nee priya sneham – aanandam, kolutumu ninne aadyantam //Neeve//

2. Oohaku min china nee ghana karyam – unnatamaina nee bahumaanam

Nee krupalone… Nee krupalone choochina deva – Jeevana daata Yesayya

kalalaina alalaina – Venuvete nilichaavu

Karuvaina korataina – Kadadaaka nadichaavu

Ihamanadu paramandu – Koluvaina Prabhu Yesu

Yenaleni daya choope – Balamaina naamame

Nee ghana naamam – Naa dhyaanam, kolutumu ninne aadyantam //Neeve//