నీవు లేని రోజు అసలు రోజే కాదయా 

నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా 

నీవే లేకపోతే నేనసలే లేనయా  

1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు 

నా కన్నీరు తుడిచి నాచేయి పట్టావు 

నన్ను విడువ నన్నావు నా చేయి పట్టావు /నీవే/

2. ఈ నాటి ఈస్తితి నీవు నాకు ఇచ్చినదే 

నేను కలిగి యున్నవన్ని – నీదు కృపా భాగ్యమే 

నీవు నా సోత్తన్నావు – కృపా క్షేమమిచ్చావు /నీవే/