New Year promises from Bible 

నూతన సంవత్సరము కొరకు దేవుని వాగ్దానములు

మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.- నిర్గమ:40:2

“On the first day of the first month (Abib) you shall set up the tabernacle of the Tent of Meeting [of God with you]. – Exo :40:2

మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.
ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా:43:18-19

“Do not remember the former things,
Or ponder the things of the past.
“Listen carefully, I am about to do a new thing,
Now it will spring forth;
Will you not be aware of it?
I will even put a road in the wilderness,
Rivers in the desert. : Isaiah :43:18-19

మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
13 అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మ
14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. రోమా :13:11-14

 Do this, knowing that this is a critical time. It is already the hour for you to awaken from your sleep [of spiritual complacency]; for our salvation is nearer to us now than when we first believed [in Christ]. 12 The night [this present evil age] is almost gone and the day [of Christ’s return] is almost here. So let us fling away the works of darkness and put on the [full] armor of light. 13 Let us conduct ourselves properly and honorably as in the [light of] day, not in carousing and drunkenness, not in sexual promiscuity and irresponsibility, not in quarreling and jealousy. 14 But clothe yourselves with the Lord Jesus Christ, and make no provision for [nor even think about gratifying] the flesh in regard to its improper desires. Romans : 13:11-14

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.యిర్మీయా:29:11

For I know the plans and thoughts that I have for you,’ says the Lord, ‘plans for peace and well-being and not for disaster, to give you a future and a hope. Jere :29:11

యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. 1 దిన:4:10

Jabez cried out to the God of Israel, saying, “Oh that You would indeed bless me and enlarge my border [property], and that Your hand would be with me, and You would keep me from evil so that it does not hurt me!” And God granted his request. 1 Chronicles : 4:10

ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా: 43:19

Behold, I will do a new thing,
Now it shall spring forth;
Shall you not know it?
I will even make a road in the wilderness
And rivers in the desert.  Isaiah: 43:19

కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.

ఎఫెసీ:4:22-24

 if indeed you have heard Him and have been taught by Him, as the truth is in Jesus: 22 that you put off, concerning your former conduct, the old man which grows corrupt according to the deceitful lusts, 23 and be renewed in the spirit of your mind, 24 and that you put on the new man which was created according to God, in true righteousness and holiness. EPHESIANS:4:22-24

నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.

For surely there is a hereafter,
And your hope will not be cut off. – 
సామెతలు /Proverbs:23:18

మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.

Blessed be the God and Father of our Lord Jesus Christ, who according to His abundant mercy has begotten us again to a living hope through the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled and that does not fade away, reserved in heaven for you,

1Peter:1:3-4

నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. 

This I recall to my mind,Therefore I have hope.

Through the Lord’s mercies we are not consumed,

Because His compassions fail not.

They are new every morning; Great is Your faithfulness.

Lamentations: 3:21:23

దేవునితో మన సాన్నిహిత్యాన్ని దిన దినము పెంచుకోవాలి అది దేవుని చిత్తము,

లోకము మనలో తగ్గి దేవునిపై ఇష్టం మనలో పెరగాలి, దీనికి ఒకే ఒక మార్గం దేవుని వాక్యం.

ఆయన మనలో వున్నపుడు లోకము  వుండనేరదు.

అనుదినము ఆయన వాత్సల్యత మనపై నిలుచునుగాక.