నిన్ను విడచి నేను జీవించగలనా నీకు విరోధముగ జీవింప సాధ్యమా/2/ యేసయ్యా.. యేసయ్యా.. /2/ 1. నాలాంటి బలహీనులు ఈ లోకంలో ఎవరు నీలాంటి బలవంతులు ఈ లోకంలో లేరు /2/ నీదు కృపయే నన్ను బలపరచెను/2/ నీదు ప్రేమయే నను చేరదీసెను/2/యేసయ్యా/ 2. పువ్వులతో చేరిన దారం సువాసనయిచ్చును నీతో నేను చేరుటవలన సువాసన కలుగును /2/ నీకు సమానులు ఈ లోకంలో ఎవరు /2/ నీకు సాటి ఎవరు లేరయ్యా /2/యేసయ్యా/ 3. శిరస్సు నుండి శరీరాన్ని వేరుచేయగలమా నీతో జీవింప ఆశపడు నను వేరుచేయ గలరా /2/ నన్ను మోసే దేవుడు నీవయ్యా /2/ క్షమించి నడిపే దైవం నీవే యేసయ్యా/2/యేసయ్యా/