నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా .. /2/ 1. నీదు స్వరము వినకనె నేను – నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితి /2/నిను/ 2. నీదివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని /2/ ఐనా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా //నీతో / 3. నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగు లోనే నిత్యం – నే నడిచెదన్ /2/ నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు సాగింతును – యేసయ్యా /నీతో /