పల్లవి:నిత్యుడైన దేవుని తోడు నీడ – నీపై ఉoడును

నిత్యము నిల్చును (5X)

1. ఎర్ర సముద్రమును – ఎడారి చేయువాడు (2X)

మారా జలములను – మాధుర్యముగ జేయును (2X) /నిత్యుడైన/

2. ఫరో సైన్యములు – పరుషాలు పల్కినను (2X)

ప్రవాహ జలములలో – పడి చావజేసెను (2X) /నిత్యుడైన/

3. బలవంతుడైన దేవుడు – ఎల్ల కాలము బలమిచ్చును (2X)

మార్గాన నడిపించును – మన్నాతో పోషించును (2X) /నిత్యుడైన/