1. ఓ ప్రార్ధన సుప్రార్ధన – నీ ప్రాభవంబున్ మరతునా ? నా ప్రభువున్ ముఖా ముఖిన్ – నే బ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమా సుప్రార్ధనా – నీ ప్రేరణంబుఁ చేగదా నీ ప్రేమధార గ్రోలుదు -నో ప్రార్ధన సుప్రార్ధన 2. పిశాచి నన్ను యుక్తితో – వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే – నా శంకలెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా – నా శైలమా నా ప్రార్ధన నా శోకమెల్ల దీర్చెడు – విశేషమైన ప్రార్ధన 3. నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను నా దేవుడేసు చెంతకు – మోదంబు గొంచుఁబోవును సదా శుభంబు లొందను – విధంబు జూప నీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్ధన – సుధా సుధార ప్రార్ధన 4. అరణ్యమైన భూమిలో – నా రమ్యమౌ పిస్గా నగం బు రంగుగాను నెక్కినా – చిరగృహంబు జూతును శరీరమున్ విదల్చినే – బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ – పరేశు ధ్యాన ప్రార్ధన రచన : విలియమ్ వాల్ ఫోర్డ్ Song number: 384 (Andhra Kraistava Keerthanalu)