ఓ సంఘమా – సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను – ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా – వినుమా 1. రాణి ఓఫేరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాద్య తరంగాలలో – ప్రాణేస్వరుని ప్రసన్నతతో ఆనంద తైలా సుగంధాభిషేకము – నొందితివే సువాసనుండా 2. క్రీస్తే నిను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచే నిర్దోషముగా – ముడత కళంకము – లేనిదిగా మహిమ యుక్తంబుగా – నిలువగోరె యేసువా – సహించుతావా తీర్పునాడూ 3. చీకటిలోనుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా – సజీవముగా నున్నావా 4. వ్యభిచారులు నరహంతకులు – పోకిరి చేష్టల డాంబికులు అబద్దజనకుని యాసనము – యెజిబెలు నీ మధ్య నివసించెనా – క్రుపావరములు – ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా 5. చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో నీమనసు మార్చుకో – తొల్లిప్రెమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు 6. కడపటి బూర మ్రోగగానే – కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనుడవై – నడియాకాసము పోగలవా గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా – రారాజు నెదుర్కొనగలవా