ఒక క్షణమైనా నిను వీడినా – నేనేమౌదునో తెలియదయ్యా /2/ ప్రభు నీతోడు నీనీడలో – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/ 1. అపవాది శోధనలు నను చుట్టినా – ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా /2/ ఆశ్రయమైన నీ నీడలో – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/ 2. కునుకక ఎన్నడు నిద్రించక నీ – కనుపాపలో కాపాడుతూ /2/ కాపరివైన నీనీడలో – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/