పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X) నీ జీవిత మూలమేదో – నీ బ్రతుకు ఆధారమేదో (2X) /ఒకసారి/ 1. తండ్రి యెహోవా తన్ను పోలి – నిను చేసెను తన వూపిరిలో (2X) నా వలెనే నీవు పరిశుద్దముగ – జీవించమని కోరెను /ఒకసారి/ 2. దేవుని వదలి దుష్టుని కూడి – లోకము తట్టు మరలి (2X) లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా /ఒకసారి/ 3. లోకము వీడు యేసయ్యన్ చూడు – నిత్య జీవముకై పరుగిడు (2X) నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా /ఒకసారి/