పల్లవి: పాడెదము వేడెదము యేసు నామము

వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము

 

1. ఈ లోక మందునా అంథకార మందునా  (2X)

దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి ..పాడెదము ..

2. శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా   (2X)

దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము..పాడెదము ..

3. ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును(2X)

దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం..పాడెదము ..