పరవాసిని నే జగమున ప్రభువా (2) – నడచుచున్నాను నిదారిన్ 

నాగురి నీవె నాప్రభువా (2) – నీదరి నేచేరెదను (నేను)(2)

1. లోకమంతా నాదని యెంచి – బంధు మిత్రులే ప్రియులనుకొంటి 

అంతయు మోసమేగా – వ్యర్ధము సర్వమిలలో – (ఇలలో)(2) 

2. ధన సంపదలు గౌరవములు – దహించిపోవు నీలోకములో(2)

పాపము నిండె జగములో -శాపము చేకుర్చుకొనే (నేను)(2)

3. తెలుపుము నా అంతము నాకు – తెలుపుము నా ఆయువు ఎంతో (2)

తెలుపుము ఎంతల్పుడనో -విరిగి నలిగి యున్నాను (నేను)(2)

4. ఆదినము ప్రభు గుర్తెరిగితిని – నీ రక్తముచే మార్చబడితిని 

క్షమాపణ పొందితివనగా – మహిమానందము కలిగె – నాలో (2)

5. యాత్రికుడనే నీలోకములో – సిలువమొయుచు సాగెదనిలలో (2)

అమూల్యమైన ధనముగా – పొందితి యేసుని – నేను (2)