Prabhu yesuni vadanamulo song Lyrics ప్రభు యెసుని వదనములో – నా దేవుడు కనిపించె(2) పాపాత్ముల బ్రోచుటకై కృపలోలికిన కలువరిలొ పరలోకముకై చిరజీవముకై – ప్రార్ధించెను నా హృదయం (2) 1.దిశ లన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో(2) దౌష్ట్యముతో మసలుచును- దౌర్జన్యము చేయుచును ధన పీడనతో..మృగ వాంఛలతో- దిగజారితి చావునకు(2) 2. చెందాడితి బ్రతుకులను – దహియి౦చితి గృహములను(2) చెరగవు నా పాపములు – తరగవు నా వేదనలు చనిపోయినను ధర వీడినను- చల్లారవు శోకములు(2) 3. పలు మారులు వినుచుంటి-నజరేయుని నీతి కధ(2) పరిహాసము చేసితిని-పరమార్ధమే మోసమని పశు ప్రాయుడనై జీవించుటచే – ప్రాప్తించెను ఈ శిలువ(2) 4. కాలువరి ఆవరణములో-కరుణాత్ముని చేరువనే(2) కనుమూసిన కాలములో- వెలుగుదఇంచిన వేళ కనుగొంటిని నా దౌర్భాగ్యస్తితి-కనుపించెను నా బ్రతుకు(2) 5. యెసు నీ రాజ్యముతో- భువికేతె౦చెడి రోజు(2) ఈ పాపిని క్షమియించి-జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని, విలపించుచును- ఈడేరెను నా వినతి(2) 6. పరదైసున ఈ దినమె- నా యానందములోను(2) పాల్గొందువు నీ వనుచు – వాగ్ధానము చెయగనె పరలోకమే నా తుది ఊపిరిగా – పయనించితి ప్రభు కడకు(2)