ప్రభువా మమ్మును దీవించి – పంపుము నీకృప నందించి అభినందనముల జేకొనుమా – విభవము మహిమొన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ 1. పగతుర ప్రేమించేడు శక్తిన్ – తగబొరుగును జూచెమా రక్తిన్ మిగులందయ చేయుము దైవ – జగదీక కుమారా కీర్తి- యుగయుగములకు నీకగుతన్ 2. గుడిలో వినిన నీవాక్యము మా -గుండెల బదిలము జేయగను గుదిబయటను నా చారములో – నడువగ దోడ్పడుమో కీర్తి యుగయుగములకు నీకగుతన్ 3. క్రైస్తవ మైత్రిని సంఘములో – విస్తరణము జెయగనిమ్ము నేస్తవ భావము లోకములో – నెరపగ దయగనుమో కీర్తి యుగయుగములకు నీకగుతన్