ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయా 1. శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్య బృందమునకు నేర్పితివి(2) పరముడ నిన్ను ప్రణుతి౦చెదను – పరలోక ప్రార్థన నేర్పుమయా 2. పరమ దెవుడవని తెలిసి – కరములెత్తి జంటగ మొడ్చి(2) శిరమును వంచి సరిగను వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయా 3. దినములోన చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ(2) దీనుడవయ్యా ఒంటిగ కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయా 4. శత్రు మూక నిను చుట్టుకొని – శిలువపైకి నిను చంపగను(2) శాంతముతో నీ శత్రుల బ్రోవగా – సలిపిన ప్రార్థన నేర్పుమయా