ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది 1. తల్లిదండ్రుల ప్రేమ – నీడవలె గతియించును కన్న బిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ 2. భార్యా భర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో – మోడులా మిగిలిపోవును యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ 3. బంధుమిత్రుల యందు – వెలుగుచున్న ప్రేమ దీపము నూనె యున్నంత కాలము – అది వెలుగు నిచ్చి ఆరిపోవును యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ 4. ధరలోని ప్రేమలన్నియు – స్థిరము కావు తరిగిపోవును యేసు క్రీస్తు కల్వరి ప్రేమ – కడవరకు ఆదరించును యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ