ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం ముదమార వసియించునా – హృదయాంతరంగమున 1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రీ – ప్రతి పాపమును కడిగి 2. అజాగరూకుడనైతి – నిజాశ్రయము విడచి కరుణా రసముతో నాకై – కనిపెట్టితివి తండ్రి 3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనె చేరితి నీదు దారి – కోరి నడిపించుము