G                       Em                            D.         C               G                                Bm             C       D           G  

రాజులకు రాజైన యీ – మన విభుని – పూజసేయుటకు రండి = యీ జయశాలి కన్న – మన కింక – రాజెవ్వరును లేరని 

    

1. కరుణగల సోదరుండై – యీయన – ధరణి కేతెంచె నయ్యా = తిరముగా నమ్ముకొనిన – మన కొసగు – బరలోక రాజ్యమ్మును 

2. నక్కలకు బొరియ లుండె – నాకాశ – పక్షులకు గూళ్ళున్డెను = ఒక్కింత స్థలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను 

3. అపహాసములు సేయుచు – నాయన – యాననము పై నుమియుచు = గృప మాలిన సైనికు – లందరును – నెపము లెంచుచు గొట్టిరి 

4. కరమునం దొక్క రెల్లు – పుడకను – దిరముగా నునిచి వారల్ = ధరణీపతి శ్రేష్టుడా – నీకిపుడు – దండ మనుచును -మ్రొక్కిరి   

5. ఇట్టి శ్రమలను బొందిన – రక్షకుని – బట్టుదలతో నమ్మిన = అట్టహాసముతోడను – బరలోక – పట్టణంబున జేర్చును 

6. శక్తిగల రక్షకుండై – మన కొరకు – ముక్తి సిద్ధము జేసెను = భక్తితో బ్రార్ధించిన – మనకొసగు – రక్తితో నాముక్తిని 

7. త్వరపడి రండి రండి – యీ పరమ – గురుని యొద్దకు మీరలు = దరికి జేరిన వారిని – యీ ప్రభువు – దరుమ డెన్నడు దూరము