రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని /2/
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ /2/
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ /2/
1.పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే /2/
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు /హ్యాప్పీ/
2.తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో /2/
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో /హ్యాప్పీ/