Rakshakundudayinchinaadata Telugu Christmas song lyrics
Lyrics in TeluguLyrics in English
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము //రక్ష//
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు //2//
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు //రక్ష//
గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత //2//
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త //రక్ష//
వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు //2//
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు //రక్ష//
పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి //2//
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె //రక్ష//
అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు //2//
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు //రక్ష//
Rakshakundudayinchinaadata – Mana Koraku Parama
1.Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu //2//
2.Gaganamu nundi diggi – Ghanudu Gaabriyelu dootha //2//
Varthamaanamu jeppi dootha – Vaibhavamuna povuchunnaadu //2//
Pashuvula thottilona – Bhaasillu vasthramula jutti //2//
Anuchu gollalokari kokaru – Aanavaalu jeppukonuchu //2//