F C Bb F రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో Am Bb F C C7 F తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి F Bb C F 1. యేసే మానవజాతి వికాసం-యేసే మానవ నీతి విలాసం Am Bb F C F యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం #రండి# 2. యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం #రండి# 3. యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్ధన సహకారం #రండి# 4. యేసే సంఘములో మన కాంతి – యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి #రండి# 5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం #రండి#