రండి యెహొవాను గూర్చి -ఉత్సాహ గానము చేసెదము ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని ఆయనే మన రక్షకుడు – పాప శాపముల నుండి 1. కష్ట నష్టములెన్నున్నా – పొంగు సాగరలెదురైన2 ఆయనే మన ఆశ్రయం – యిరుకులొ ఇబ్బందులలో2 2. విరిగి నలిగిన హృదయముతో- దేవ దేవుని సన్నిధిలో2 అనిశము ప్రార్ధించిన – కలుగు ఈవులు మనకెన్నో2 3. త్రొవ తప్పిన వారలను – చేరదీసే నాధూడని2 నీతి సూర్యుండాయనేయని – నిత్యము స్తుతి చేయుదము2