D                     Bm          G      A

రుచి చూచి యెరిగితిని యెహొవా ఉత్తముడనియు /2/

D           Bm       G      A    D

రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని /2/    

1. గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే /2/

తప్పక ఆరాధింతు – దయాళుడవు నీవే /2/ రుచి/

2. మహొన్నతుడవగు దేవా- ప్రభావము గలవాడా /2/

మనసార పొగడేదను – నీ ఆశ్చర్య కార్యములన్ /2/ రుచి/

3. మంచితనము గల దేవా – అతి శ్రేస్టుడవు అందరిలో /2/

ముదమార పాడేద నిన్ను – అతి సుందరుడవనియు /2/ రుచి/

4. కృతజ్ఞత చెల్లింతు – ప్రతిదాని కొరకు నేను  /2/

క్రీస్తునియందె తృప్తి – పొంది హర్షించేదను /2/ రుచి/