సాక్ష్యమిఛెద మన స్వామి యేసు దేవుడంచు – సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయె 1. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను – స్వామి రక్షించెనంచు 1. దిక్కు దెసయు లేనినన్ను – దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు – మన శాంతి నిచ్చినాడో 2. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పిల్లలకును బెద్దలకును – బ్రేమతో నా స్వానుభవము 3. బోధ చేయలేను వాద -ములకు బోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసి నంతవరకు 4. పాపులకును మిత్రుడంచు – బ్రాణమొసగి లేచెనంచు బావముల క్షమించునంచు – బ్రభుని విశ్వసించుడంచు 5. చోరులైన జారుల నాచారులైన నెవ్వరైన ఘోరపాపు లైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు 6. పరమత దూషణము లేల – పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల – యేసు క్రీస్తు దేవుడంచు 7. ఎల్లకాల మూరకుండ – నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును – తండ్రి కుమారాత్మ పేర