సమర్పణ చేయుము ప్రభువునకు – నీ దేహము ధనము సమయమును 1. అబ్రామును అడిగెను ప్రభువపుడు – ఇస్సాకును అర్పణ ఇమ్మనెను నీ బిడ్డను సేవకు నిచ్చెదవా – నీ విచ్చెదవా #సమర్పణ# 2. ప్రియము దేవునికి హేబేలు బలి – హేయము కయినుని అర్పణము కళంకము కల్మషమంటనివి – నీ విచ్చెదవా #సమర్పణ# 3. అయిదు రొట్టెలు చేపలు రెండు – అయిదు వేలకు ఆహారముగా అర్పించెనా బాలుడా కటి వేళ – అట్లిచ్చెదవా #సమర్పణ# 4. ప్రభుని ప్రేమించిన పేదరాలు – కాసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికిచ్చెన్ – నీవిచ్చెదవా #సమర్పణ# 5. నీ దేహము దేవుని ఆలయము – నీ దేవుడు మలచిన మందిరము సజీవ యాగముగా నీ విచ్చెదవా – నీ విచ్చెదవా #సమర్పణ#