Sarva krupanidhi yagu prabhuvaa song lyrics 1. సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము – సంతోషముగ నిను పొగడెదము పల్లవి: హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయ యని పాడెదను – ఆనందముతో సాగెదను 2. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నను రక్షించితివి పరిశుద్దముగ జీవించుటకై – పాపిని నను కరుణించితివి /హల్లెలూయ/ 3. మరణ శరీరము మార్పు నొంది – మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి – మరణ భయములను తీర్చితివి /హల్లెలూయ/