Sarvaloka nivaasulaara song lyrics సర్వలోక నివాసులారా – సీయోనులో స్తుతి చెల్లించుడి సంతోష గీతము పాడుడి – దేవుని నామము స్తోత్రించుడి ఈలాగు దేవుని – స్తోత్రించుడి #2# అ. ప. నీ కార్యములు గంభీరముల్ – నీదు క్రియలు – ఆశ్చర్య కరములు నీ నామమునే కీర్తించెదం – నీకు నమస్కరించెదము #సర్వ# 1. ఆకాశములలొ మహిమ – భువియందు నీ నామ ప్రభావము సర్వోన్నతుడు యెహోవా – సాగిలపడి పూజించుడి #ఈలాగు# 2. ప్రేమ స్వరూపి యేసు – ప్రాణార్పణ చేసెను ప్రేమతో పరిశుద్ధాత్మను పంపెను – కృతజ్ఞత స్తుతి అర్పించుడి #ఈలాగు# 3. ప్రార్థన నాలించువాడు – మన ఆశ్రయము ఆధారము పూర్ణ రక్షణ కలిగించె – ఉత్సాహ గానము చేయుడి #ఈలాగు#