Sarvaloka nivaasulaara song lyrics

సర్వలోక నివాసులారా – సీయోనులో స్తుతి చెల్లించుడి 

సంతోష గీతము పాడుడి – దేవుని నామము స్తోత్రించుడి 

ఈలాగు దేవుని – స్తోత్రించుడి #2#

అ. ప. నీ కార్యములు గంభీరముల్ – నీదు క్రియలు – ఆశ్చర్య కరములు 

నీ నామమునే కీర్తించెదం – నీకు నమస్కరించెదము   #సర్వ#

1. ఆకాశములలొ మహిమ – భువియందు నీ నామ ప్రభావము 

సర్వోన్నతుడు యెహోవా – సాగిలపడి పూజించుడి #ఈలాగు#

2. ప్రేమ స్వరూపి యేసు – ప్రాణార్పణ చేసెను ప్రేమతో 

పరిశుద్ధాత్మను పంపెను –

కృతజ్ఞత స్తుతి అర్పించుడి #ఈలాగు#

3. ప్రార్థన నాలించువాడు – మన ఆశ్రయము ఆధారము 

పూర్ణ రక్షణ కలిగించె – ఉత్సాహ గానము చేయుడి #ఈలాగు#