సర్వ కృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతి౦చెదను – సంతసముగ నిన్ను పొగడేదను (2) హల్లెలూయ – హల్లెలూయ(2) హల్లెలూయ యని పాడేదను- ఆనందముతో సాగెదను 1. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతీతో నను రక్షించితీవి(2) పరి శుద్దముగ జీవించుటకై- పాపిని నను కరుణించితీవి (2)#హల్లె# 2. అల్ప కాల శ్రమలనుభవింప – అనుదినము కృప నిచ్చితివి(2) నాధుని అడుగు జాడలలో – నడచుటకై నను పిలచీతీవి(2)#హల్లె# 3. మరణ శరీరము మార్పు నొ౦ది – మహిమ శరీరము పొందుటకై(2) మహిమాత్మతో నను నింపితీవీ- మరణ భయములను దీర్చితీవి(2)#హల్లె# 4. ఎవరూ పాడని గీతమును – యేసుతో నేను పాడుటకై(2) హేతువు లేకయే ప్రేమించెన్ – యేసుకు నేనే మివ్వగలన్ (2)#హల్లె#