Siluve naa saranaayenu ra Song lyrics సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే / 1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే / 2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే / 3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే / 4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే / 5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే / రచన: చెట్టి భానుమూర్తి తాళం: ఆది తాళం రాగం: కురంజి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు : 198 Lyrics in English: Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa – Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/ 1. Siluvanu vraali Yesu – Palikina palukulandu – Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/ 2. Siluvanu joochukoladi – Silasamaanamaina manasu = Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/ 3. Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa = Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/ 4. Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka = Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/ 5. Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva = Durita dooruda nee dari jeriti rua / Nee siluve/ Lyrics: Chetti Bhanu moorthi Taalam: Aadi Raagam: Kunjira Andhra Kraistava Keerthanalu: song 198